Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

12-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు శారీరక దారుఢ్యం కోసం కరాటే నేర్చుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల గ్రామంలో భగత్‌సింగ్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. కరాటే వంటి యుద్ధకళలు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచడమే కాకుండా స్వీయ రక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా శిక్షణలు అందించడం అభినందనీయమన్నారు.

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్‌ రాచకొండ రాజు, నాయకులు తాళ్లపల్లి జితేందర్‌, గంటెపాక శివకుమార్‌, తొలుపునూరి చంద్రశేఖర్‌, బూడిద బిక్షం, జంపాల ఉమాపతి, ఆకుల ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు కరాటే నేర్చుకోవాలి. సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News