Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:48 PM

విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలి –జిల్లా యంత్రాంగం సూచన

24-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్థవంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 54 కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన సిబ్బందిని నియమించారు.మొత్తం 35,986 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. పదవ తరగతి పరీక్షలకు 123 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 24,657 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, నిషేధాజ్ఞలు అమలు చేయడం, జిరాక్స్ సెంటర్ల తాత్కాలిక మూసివేత వంటి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సదుపాయాలు కల్పించారు.విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని, సెల్‌ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, డీఈవో వెంకటేశ్వర్లు, డిఐఈఓ గోవింద్ రామ్, డిటిఓ కవిత, జడ్పీ సీఈవో, డిపిఓ జానకి రెడ్డి, డిఎంఎల్‌హెచ్‌ఓ వసంత్ రావు, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలి –జిల్లా యంత్రాంగం సూచన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News