Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

విద్యార్థుల్లో యోగ, పోటీ పరీక్షలపై చైతన్యం

12-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగ ప్రాముఖ్యతతో పాటు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం మాట్లాడుతూ.. యోగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగాను జీవన విధానంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు.

డిగ్రీ అనంతరం పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై అధ్యాపకులు డాక్టర్‌ జె. చిన్నబాబు, డాక్టర్‌ జి. సునీత విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమ ఇన్‌చార్జి, వ్యాయామ అధ్యాపకులు డాక్టర్‌ ఎం. రవీందర్‌రావు యోగాసనాలపై ప్రదర్శన నిర్వహించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ సభ్యులు ఎం. అనిత, టి. శ్రీనివాస్‌, పరిపాలనాధికారి జి. కరుణాకర్‌, అధ్యాపకులు డాక్టర్‌ రత్నమంజుల, డాక్టర్‌ లక్ష్మీనీలిమ, డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్‌ సీహెచ్‌. వెంకట్‌గౌడ్‌, డాక్టర్‌ డి. కిషన్‌, డాక్టర్‌ రాచమళ్ళ శ్రీను, ఎస్‌. బాలరాజు, జె. నరేశ్‌, ఎ. ఆంజనేయులు, రాధికతో పాటు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో యోగ, పోటీ పరీక్షలపై చైతన్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News