Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

విద్యార్థుల చైతన్యానికి స్వపరిపాలన వేడుక

11-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో సౌమ్య విద్యామందిర్‌లో ప్రత్యేక కార్యక్రమం

చిట్యాల: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒకరోజు పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ పాఠశాల నిర్వహణను స్వయంగా చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల పరిపాలనను విద్యార్థులే నిర్వహిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌గా బోగ ఆనంది, మెట్టు వర్షిత బాధ్యతలు నిర్వర్తించగా, విద్యాశాఖ మంత్రిగా కొత్త ప్రణీత్ కుమార్, జిల్లా కలెక్టర్‌గా భూతం రిషా కుమారి, డిప్యూటీ కలెక్టర్‌గా ఈరటి వర్షిత, జెడ్పీ చైర్‌పర్సన్‌గా గుజ్జ జ్యోతి, డీఈవోగా మెట్టు శివతేజ, డిప్యూటీ డీఈఓగా ఆకుల సుప్రీత్, ఎంఈఓగా కోడి ఇందు, ఎంపీడీవోగా లోడే దివ్యశ్రీ, ఎంపీవోగా లోడే కార్తీక్ విధులు నిర్వహించారు. పాఠశాల పరిపాలనతో పాటు తరగతుల నిర్వహణను కూడా సమర్థంగా పర్యవేక్షించారు.

ఇక ఉపాధ్యాయులుగా కార్తీక్, ప్రణవి, సహస్ర, శ్రీరామ్, శ్రీకృష్ణప్రియ, రిచిత, అనుశ్రీ, పవిత్ర, శృతి, ప్రత్యూష, సారిక, కావ్య, మంజునాథ్, లక్ష్మీ ప్రసన్న, మోక్షజ్ఞ, ప్రతీక్, యశశ్రీ, అలీనా తరన్నం, అజయ్ కుమార్, అరణ్యశ్రీ యాదవ్, నేహిత, ప్రేమ్ కుమార్, వీణ, అఖిల్ గౌడ్, ఆర్యన్ గౌడ్, దీపక్, శశిధర్ తదితరులు ఉపాధ్యాయుల వేషధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను అనుకరిస్తూ పాఠాలు బోధించిన తీరు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించింది.

వివిధ హోదాల్లో విద్యార్థులు విధులు నిర్వహించడం చూసిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు బోధించిన ఉపాధ్యాయుల ముందే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించడం విద్యార్థులకు ప్రత్యేక అనుభవంగా మారింది. రాజకీయ నాయకుల పాత్రలో ఉన్న విద్యార్థులు ప్రత్యేక వాహనాల్లో పాఠశాలకు చేరుకోవడం కార్యక్రమానికి మరింత ఆకర్షణను తెచ్చింది.ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు బొడిగె రవీందర్, ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో మనోవికాసం, నాయకత్వ లక్షణాల పెంపొందనకు దోహదపడతాయని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ఎంత బాధ్యతతో కూడుకున్నదో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారని పేర్కొన్నారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బొడిగె రవీందర్‌తో పాటు ఉపాధ్యాయులు బొడిగె రాణి, రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, ఈరమళ్ల లూసిక, మునుకుంట్ల స్వాతి, బెల్లంకొండ రాజేశ్వరి, కోనేటి యాదగిరి, సురోజు హర్షిని, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల చైతన్యానికి స్వపరిపాలన వేడుక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News