రామన్నపేట పట్టణానికి చెందిన రాపోలు ఉపేందర్ కుమార్తె రాపోలు అంజని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీఎంఎల్‌టీ గ్రూపులో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి 971 మార్కులు పొందింది. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యార్థినిని శాలువాతో సత్కరించి అభినందించారు.
విద్యలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఏటెల్లి శ్రీనివాస్, రాపోలు ఉపేందర్, బోదాసు రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి