Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

విద్యార్థి దశలో సరైన నిర్ణయాలే విజయానికి పునాది: చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్

14-05-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తంగడపల్లి జడ్పీ పాఠశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు

విద్యార్థి దశలో తీసుకునే సరైన నిర్ణయాలు, ప్రణాళికాబద్ధమైన కృషి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని చౌటుప్పల్ పుర చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. పుర పరిధిలోని తంగడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు – ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.

పాఠశాలప్రధానోపాధ్యాయురాలు ధీరావత్ భార్గవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటే గురువులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంస్కారం కలిగి ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనిపిలుపునిచ్చారు.అనంతరం పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మనస్విని, మాధురి, శైలి, పునిత్, సహానా, స్నేహ, హన్సికలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, గడ్డం ఇందిర రాజారత్నం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఉదరి పద్మ, ఉపాధ్యాయులు ఎం.వి. చారి, వెంకటేశ్వరరావు, అంతటి వెంకటేశం, సరళ, నీరజ, లింగయ్య, ప్రతిమ, మంగమ్మ, మహేశ్వరి, రమాదేవి, యాదయ్య, శ్వేత, పద్మావతి, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి దశలో సరైన నిర్ణయాలే విజయానికి పునాది: చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News