Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:00 AM

విద్యార్థులు చిన్న వయసులోనే ట్రాఫిక్ అవగాహన పొందాలి–ఎస్పీ సూచనలు

19-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి పట్టణంలోని సంయుక్త పాఠశాలలో ఈ రోజు “అరైవ్ అలైవ్ – 2026” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరై విద్యార్థులను స్వాగతించారు.విద్యార్థులు ఆటలు, పాటల ద్వారా ట్రాఫిక్ అవగాహనను ప్రదర్శించారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే “అరైవ్ అలైవ్ – 2026” ఉద్యమ లక్ష్యం అని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు బాధ్యతాయుత పౌరులని, చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువవుతాయని పేర్కొన్నారు.విద్యార్థులు ఈ అవగాహన తమ తల్లిదండ్రులకు కూడా పంచుకోవాలని సూచించారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలి,పరిమిత వేగంలో వాహనాలు నడపాలి అని ఎస్పీ స్పష్టం చేశారు.ద్విచక్ర వాహనాల్లో ముందుగానే హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఫోర్ వీలర్ వాహనాల్లో సీటు బెల్ట్ తప్పనిసరి అని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపరాదు, మత్తులో వాహన నడిపితే ప్రమాదం కలగవచ్చని హెచ్చరించారు. ఓవర్ స్పీడ్ క్షణిక ఆనందాన్ని ఇస్తుందేమో, అది ప్రాణహానికి దారితీయవచ్చని చెప్పారు.అనంతరం, జిల్లా ఎస్పీ “అరైవ్ అలైవ్ – 2026” పోస్టర్లను ఆవిష్కరించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ తలకే కాకుండా కుటుంబాన్ని రక్షించే పరికరమని గుర్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ వనజ ప్రత్యేక ముగ్గు రూపకల్పన ద్వారా ట్రాఫిక్ నియమాలను ప్రతిబింబించారు. జిల్లా ఎస్పీ వనజను అభినందించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ,కొండాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, ఎస్‌ఐ సోమేశ్వరి,మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు చిన్న వయసులోనే ట్రాఫిక్ అవగాహన పొందాలి–ఎస్పీ సూచనలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News