Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి

07-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలనీ పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్వాహకులు సురుపంగ శివలింగం,దొడ్డి యాదగిరి,సిలువేరు జైపాల్,భానోతు భాస్కర్ నాయక్ లు అన్నారు. శనివారం రోజు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగ గత నవంబర్ ఇరవై ఆరవ తేదీన నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. మాత రమాభాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ తీగుళ్ళ జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాలెడ్జ్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ... దేశ పౌరులందరూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనీ,ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల యొక్క విశిష్టతను తెలుసుకోవాలని రాజ్యాంగంలోని ప్రతీ ఆర్టికల్ దేశాన్ని అన్ని రంగాలలో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను బలోపేతం చేస్తుందని అన్నారు. రాజ్యాంగానికి ప్రాధమిక హక్కులు ప్రజాస్వామ్యానికి ప్రాణం అయితే ఆదేశిక సూత్రాలు సామాజిక న్యాయయానికి మార్గమని,ప్రాధమిక హక్కులు వ్యక్తిని కాపాడితే,ఆదేశిక సూత్రాలు సమాజాన్ని మారుస్తాయని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్ధినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా నిర్వాహకులు పన్నెండు పంది విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.మాత రమాభాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు సమర్పించిన అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయనిలు జి స్వాతి,ఎం.స్వాతి. రిజ్వానా,వెన్నెల,మౌనిక,మమత,ఉషా,జ్యోతి,మాధవి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News