Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

విద్యార్థుల ప్రతిభకు వేదిక: మండల స్థాయి పరీక్షలు విజయవంతం

Updated : 21 Jan 2026 18:15 IST
As Preferred Source 1 min read
విద్యార్థుల ప్రతిభకు వేదిక: మండల స్థాయి పరీక్షలు విజయవంతం

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం (టి.ఎస్.ఎస్.టి.ఎఫ్) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో మనూర్ మండల స్థాయి ప్రతిభా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మనూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్షను రాశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి రాజశేఖర్ షేట్కార్ మాట్లాడుతూ...విద్యే జీవితానికి పునాది అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతో పాటు మంచి విలువలను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు జి. వైద్యనాథ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రతిభా పరీక్షలు విద్యార్థుల్లో పోటీ భావనను పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల ఇన్చార్జిలు జ్యోతిర్లింగం రవీందర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు విజయ్ కుమార్, నరసింహారెడ్డి, మచ్చేందర్, మధుకర్ రెడ్డి, స్వప్న, గోవర్ధన్ తదితరులు చురుకుగా పాల్గొన్నారు.ఈ ప్రతిభా పరీక్షలు విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసింది.

Sthanikam

విద్యార్థుల ప్రతిభకు వేదిక: మండల స్థాయి పరీక్షలు విజయవంతం

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news