Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు ఆరిపోవడం బాధాకరం; ఎమ్మెల్యే సామెల్

24-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి:విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు వృత్తి నిర్వహణలో భాగంగా పాఠశాలకు వస్తున్న క్రమంలో కారు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి బోయిన లింగయ్య అధ్యక్షతన ఇటీవల కారు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయుల సంతాప సభలో పాల్గొని మాట్లాడారు, ఉపాధ్యాయులు సమాజంలో ఉన్న చెడులు తొలగించి బావి భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు ఆరి పోవడం బాధాకరం అని అన్నారు, ఈ మేరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కస్తూరిబా ప్రిన్సిపాల్ కల్పన, రావులపళ్లి ప్రధానోపాధ్యాయురాలు గీతారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతానని అన్నారు. ఉపాధ్యాయుల సేవలు సమాజానికి అమూల్యమని, వారి అకాల మరణం విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మృతులకు చేరో రూ.లక్ష ఆర్ధిక సాయం తో పాటు గాయపడిన ఉపాధ్యాయులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తిరుమలగిరి సింగిల్ విండో చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ వసంత, వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల బాధ్యులు పోతరాజు చంద్రశేఖర్, సూర్య ప్రకాష్, నవీన్ ప్రసాద్, కార్తీక్ రెడ్డి, రవిశంకర్, చిలక శ్రీనివాస్, గుజ్జ భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు,జిల్లా నాయకులు దాసరి శ్రీను, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, మాచర్ల అనిల్,సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మృతుల కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు ఆరిపోవడం బాధాకరం; ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News