Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన

02-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో తీవ్ర నాణ్యత లోపం ఉందని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు భోజన గిన్నెలతోనే రాష్ట్ర రహదారి నార్కెట్‌పల్లి– అద్దంకి మార్గాన్ని అడ్డగించి నిరసన తెలిపారు.

విద్యార్థులు మాట్లాడుతూ, హాస్టళ్లలో అందిస్తున్న భోజనంలో అంబర్ (ప్లాస్టిక్) ప్యాకెట్లు లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. భోజన నాణ్యతను మెరుగుపరుస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు.

Sthanikam

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఏబీవీపీ ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News