Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

29-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వెంటనే బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కౌ న్సిల్(ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి.) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓం ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ గురువారం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.వారు ఆసుపత్రిలో వైద్యులను కలసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులందరికి స్పష్టంగా సూచనలు ఇచ్చారు.అదేవిధంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత,వారి హక్కుల పరిరక్షణకు ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. అధికారులు శ్రద్ధ చూపుతూనే ఉంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యా అధికారులు,ఆసుపత్రి వైద్యులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ఆరోగ్యం,హక్కుల పరిరక్షణపై ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి. ప్రత్యేక శ్రద్ధ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News