Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:53 AM

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు

19-01-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ షబానా నాజ్ మాలి, ఉపసర్పంచ్ మైబు పటేల్ గ్రామంలోని వివిధ వార్డు సభ్యులతో కలిసి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే పాఠశాల ఆవరణలో శుభ్రత అత్యంత అవసరమని వారు తెలిపారు.అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కార్మికులు ఎప్పటికప్పుడు విధులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం–ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేసిన గ్రామ పాలకులు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ షబానా నాజ్ మాలి, ఉపసర్పంచ్ మైబు పటేల్ గ్రామంలోని వివిధ వార్డు సభ్యులతో కలిసి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే పాఠశాల ఆవరణలో శుభ్రత అత్యంత అవసరమని వారు తెలిపారు.అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కార్మికులు ఎప్పటికప్పుడు విధులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News