Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:34 AM

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”

01-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

చదువే ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ప్రతి బాలుడు తప్పనిసరిగా విద్యను పొందాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ అన్నారు.శనివారం వీధి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ స్కూల్‌లో విద్యార్థుల హక్కులపై అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, విద్య ప్రతి బాలుడి మౌలిక హక్కు అని, విద్య ద్వారానే పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలిపారు. చదువు వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాన్ని సరైన దిశలో నడిపించే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు.బాలలపై ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం,భద్రత,పోషణ వంటి హక్కులను కల్పించాల్సిన బాధ్యత సమాజం, తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని వారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం గైనికాడి సురేష్ గౌడ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

“విద్యే వెలుగు, చదువే భవిష్యత్తు: పిల్లల హక్కులపై సదస్సు”

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News