Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

విద్యా వారోత్సవాలు ముగింపు. స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్‌కు సన్మానం

17-05-2026 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు పత్రికా విలేకరులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. ఈ సందర్భంగా స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్‌కు చిరు సన్మానం చేసి షీల్డ్ తో సత్కరించారు .

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. తాము చదివిన విద్యాసంస్థను మరచిపోకుండా ప్రస్తుత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పత్రికా మిత్రుల సహకారం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డా. జి. సునీత, డా. రాచమళ్ల శ్రీను, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డా. తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డా. ఎం. రవీందర్ రావు, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, డాక్టర్ డి. కిషన్, కార్యాలయ సిబ్బంది ఫయాజ్, షరీఫ్, శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యా వారోత్సవాలు ముగింపు. స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్‌కు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News