Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

విద్యా వారోత్సవాలు ముగింపు. రిపోర్టర్లకు సన్మానం

17-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు సమాజంలో బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్న పాత్రికేయులను కళాశాల యాజమాన్యం సన్మానించింది.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ గత వారం రోజులుగా విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ రంగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి కళాశాలకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. కళాశాలలో జరిగే కార్యక్రమాలను వార్తల ద్వారా సమాజానికి చేరవేస్తూ కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న పత్రికా విలేకరుల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానికం ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్, నవతెలంగాణ రిపోర్టర్ బూరుగు వెంకటేశం, తెలంగాణ గళం రిపోర్టర్ కె.వి. సుధాకర్ రాజు, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్,మన ప్రగతి రిపోర్టర్ కైరం కొండ సంతోష్ కుమార్‌లను కళాశాల అధ్యాపకులు శాలువాలు కప్పి, షీల్డ్‌లతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఐక్యూఎసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, సభ్యులు డాక్టర్ రత్న మంజుల, రాధిక, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీను, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, కార్యాలయ సిబ్బంది శ్రీదేవి, నాగరాజు, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యా వారోత్సవాలు ముగింపు. రిపోర్టర్లకు సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News