విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్
విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
విద్య కేవలం జ్ఞానం కాదు, మంచి మనిషిగా మారడం" – ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి: డి.డి. దాస్ సీనియర్ జర్నలిస్ట్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంజియూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ "మహాత్మా గాంధీ గారి మహత్తర జీవితం మరియు ఆదర్శాలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత. సత్యం, అహింస, నైతిక విలువలు అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీజీ". "గాంధీ గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు — ఆయన ఒక జీవన విధానం. స్వీయ క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక సమానత్వం పట్ల ఆయన చూపిన అంకితభావం నేటి తరానికి కూడా మార్గదర్శకం. విద్య అనేది కేవలం జ్ఞానం పొందడం మాత్రమే కాదు, మంచి మనిషిగా మారడమే అన్న ఆయన సందేశం విశ్వవిద్యాలయాల వంటి విద్యా సంస్థలకు అత్యంత ప్రాసంగికమైనది"."నేటి కాలంలో పెరుగుతున్న అసహనం, హింస, స్వార్థం మధ్య గాంధీ గారి ఆలోచనలు మరింత అవసరంగా మారాయి. మన ఆలోచనల్లో, మాటల్లో, కార్యాచరణలో సత్యం మరియు అహింసను పాటించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది".
ఈ సందర్భంగా, విద్యార్థులంతా గాంధీ గారి ఆదర్శాలను తమ జీవితాల్లో అమలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. అధ్యాపకులు మరియు సిబ్బంది కూడా ఆయన బోధనల నుంచి ప్రేరణ పొందుతూ విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించాలని కోరుకుంటున్నాను.మహాత్మా గాంధీ గారి స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడిచే శక్తి మనందరికీ కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి,ఇన్ఫాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, యుసిసిబిఎం ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ శేఖర్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ కిరణ్మయి, రమేష్ నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి