Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.

23-05-2026 278 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శంకర్ గుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు ఉపాధిహామీ కూలీలకు సరైన వేతనాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఓ ఆర్ యస్ పాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనులకు వచ్చే వారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలుచటి కాటన్ దుస్తులు ధరించి రావాలని అవగాహన కల్పించారు.

అలాగే కూలీలకు తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, బోనగిరి సంజీవ్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎండలో ఉపాధి కూలీలకు అండగా సర్పంచ్ విక్రమ్. పనుల నాణ్యత పరిశీలన.. కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్ల పంపిణీ.

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామంలోని శంకర్ గుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు ఉపాధిహామీ కూలీలకు సరైన వేతనాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఓ ఆర్ యస్ పాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనులకు వచ్చే వారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలుచటి కాటన్ దుస్తులు ధరించి రావాలని అవగాహన కల్పించారు.

అలాగే కూలీలకు తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల మంజుల, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, బోనగిరి సంజీవ్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News