Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

ఈ-స్కూటర్‌ పై కలెక్టరేట్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్

18-05-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఇంధన పొదుపులో భాగంగా సోమవారం పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి ఎలక్ట్రిక్ వాహనంలో కలెక్టరేట్ వచ్చి హాజరైన కలెక్టర్...ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చర్యలు చేపట్టారు.డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలనే సందేశంతో ఆయన 'నో వెహికల్ డే' (No Vehicle Day) పాటించారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, భవిష్యత్తు తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి, ఎలక్ట్రిక్ వాహనాలను లేదా ప్రజా రవాణాను వినియోగించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా ఈ-స్కూటర్‌పై రావడంపై కలెక్టరేట్ సిబ్బంది, ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

Sthanikam

ఈ-స్కూటర్‌ పై కలెక్టరేట్‌కు చేరుకున్న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News