Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:22 PM

దొంగతనాల కేసుల్లో పోలీసుల విజయం.. ₹15.5 లక్షల ఆస్తి స్వాధీనం

10-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల చాకచక్యంతో వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి భారీగా దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ S. సతీష్ కుమార్ఆ దేశాల మేరకు, పెనుకొండ డీఎస్పీ U. నరసింగప్ప మరియు సీఐ K. రాఘవన్ప ర్యవేక్షణలో రొద్దం, పెనుకొండ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

రొద్దంలో ఇద్దరు అరెస్ట్

ఈ నెల 8న రొద్దం మండలం పెద్దమంతూరు గ్రామంలోని ఓల్డ్ జెడ్‌పీ హైస్కూల్ వద్ద ఎస్‌ఐ వీరాంజనేయులు నేతృత్వంలోని పోలీసులు ఉల్లెడ మల్లేష్ (41), టి. నవీన్ కుమార్ (36)లను అరెస్ట్ చేశారు. వీరు కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి శేషాపురం గ్రామంలోని ఆలయ హుండీ నుంచి దొంగిలించిన వెండి వస్తువులు, గోరంట్ల, ధర్మవరం ఐ టౌన్ పరిధిలో జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు, కనగానపల్లి, సీకే పల్లి ప్రాంతాల్లో దొంగిలించిన రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పెనుకొండలో మరో నిందితుడు అరెస్ట్

మరో ఘటనలో ఈ నెల 9న పెనుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ వద్ద ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది షికారి శీన @ అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అతను అనంతపురంలోని టీవీ టవర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు పేర్కొన్నారు.

అతని వద్ద నుంచి పెనుకొండ, సోమందేపల్లి ప్రాంతాల్లో జరిగిన ఇళ్ల దొంగతనాలకు సంబంధించిన రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹5.50 లక్షలు ఉంటుందని తెలిపారు.

ఈ రెండు ఘటనల్లో మొత్తం ₹15.50 లక్షల విలువైన దొంగతన ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

దొంగతనాల కేసుల్లో పోలీసుల విజయం.. ₹15.5 లక్షల ఆస్తి స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News