Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:51 AM

దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది

03-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దొడ్డి కొమరయ్య 99 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసు వులుబాసిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు, మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం నాడు దొడ్డి కొమరయ్య 99 వ జయంతి సందర్భంగా పండితాపురం గ్రామంలో చిత్రపటానికి మల్లి బాబు యాదవ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించి

నిజాం జాగిర్దారుల బలవంతమైన వెట్టి చాకిరి నిర్మూలన కొరకు తెలంగాణ సాధన కోసం, జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కేవలం 19 ఏళ్లకే చిన్న వయసులోనే ప్రాణాలను పణంగా పెట్టి తొలి అమరవీరుడ య్యాడని, నాడు ఆయన చూపిన త్యాగం మనందరకు స్ఫూర్తి అని, అందుకే మనం తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామని, దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు మేమంతా కట్టుబడి ఉన్నామని, వారి ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల మల్లికార్జునరావు, జి. రవి చింతల పెద్ద వెంకయ్య, అల్లిక బక్కయ్య, శీలం పుల్లయ్య, పాటిబండ్ల ప్రసాదు, మల్లికార్జున్ నరేష్ నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ సాధనకు పునాది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News