Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

దివ్యాంగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి : నిర్మల జగ్గారెడ్డి

దివ్యాంగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి : నిర్మల జగ్గారెడ్డి

దివ్యాంగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి : నిర్మల జగ్గారెడ్డి
May 18, 2026 08:02 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆత్మస్థైర్యం, పట్టుదలతో చదువుకుని ఎంతో మంది దివ్యాంగులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సంజీవ్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలు, చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. శారీరక ఇబ్బందులు విజయానికి అడ్డంకి కావని, పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారి ప్రతిభను వెలికితీయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పురపాలక సంఘ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సంగీతా మహేష్, యశోద, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News