Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

దివ్యాంగుల హామీలు అమలు చేయాలి. మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం

20-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను కలిసి వినతిపత్రం అందజేశాయి.

దివ్యాంగులు రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యలో ప్రత్యేక సదుపాయాలు, స్వయం ఉపాధి పథకాల బలోపేతం, ఐటీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగుల సమస్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నకరకంటి అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, సభ్యులు వేణుగౌడ్, వికలాంగుల రాజ్యాధికార ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వంశరాజ్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల హామీలు అమలు చేయాలి. మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News