Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ
20-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోందని భువనగిరి మండల విద్యాధికారి పి. నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో (ALIMCO), సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి పెన్షనర్స్ భవన్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ పెసరు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 17 మండలాల నుంచి 148 మంది దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఉపకరణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

చౌటుప్పల్, భువనగిరి, గుండాల మండలాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే వీల్‌చైర్లు, సీపీ చైర్లు, రోలేటర్లు, వినికిడి యంత్రాలు, టీఎల్‌ఎం కిట్లు తదితర ఉపకరణాలు అందజేశారు.

కార్యక్రమంలో మోత్కూరు మండల విద్యాధికారి టి. సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్లు కిరణ్, రామచంద్రు, రవీందర్ రెడ్డి, సుధామణి, సంధ్యారాణి, సుజాత, ఆలింకో ప్రతినిధులు సోనీ కుమారి, శోభిత్ ద్వివేది, సుమీత్ రాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News