Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు

19-02-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా,R&B, రవాణా,ఆర్టీసీ,పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పరిస్థితిని శాఖల వారీగా సమీక్షించారు.జిల్లా లో అత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలు, ముఖ్యంగా జాతీయ రహదారులపై చోటుచేసుకున్న ప్రమాదాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదాల గణాంకాలు, కారణాలపై సమగ్ర విశ్లేషణ జరపాలని ఆదేశించారు.తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను “బ్లాక్ స్పాట్స్”గా గుర్తించి, వాటిపై తక్షణమే హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, రోడ్ల మరమ్మతులు వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.అదనంగా, రహదారుల వెంట పెరిగిన చెట్ల కొమ్మలు, అడ్డంకులు తొలగించడం, సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.ఎక్కడైనా ప్రమాదం సంభవించినప్పుడు దానికి గల అసలు కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం కలిగి ఉండాలని చెప్పారు. రోడ్డు భద్రత అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, ప్రతి శాఖ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.

Sthanikam

జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News