Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

జిల్లాలో ఇంధనానికి కొరత లేదు కలెక్టర్ బి. చంద్రశేఖర్..

25-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

వదంతులు నమ్మవద్దు నిల్వలు నిండుగా ఉన్నాయి..

బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు పెడితే చర్యలు..

నల్గొండ : నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, వినియోగదారులు ఆందోళనతో ముందస్తుగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై బుధవారం ఆయన పౌరసరఫరాల అధికారులు, పెట్రోల్, గ్యాస్ డీలర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని కలెక్టర్ ఖండించారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని అనవసర భయాందోళనలతో ప్రజలు బంకుల వద్ద ఎగబడటం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ స్టాక్ అందుబాటులో ఉంది. ఏ బంకు వద్ద కూడా 'నో స్టాక్' బోర్డులు ప్రదర్శించకూడదు. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని పోలీసులతో పాటు గ్రామ పరిపాలన అధికారులు, కారోబార్లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. డీలర్లకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న మూడు నాలుగు రోజులు అత్యంత కీలకమని ఈ సమయంలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల వద్ద రద్దీని నియంత్రించాలని సూచించారు.

​శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం.. ఎస్పీ

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఇంధన సరఫరా కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

Sthanikam

జిల్లాలో ఇంధనానికి కొరత లేదు కలెక్టర్ బి. చంద్రశేఖర్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News