Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:20 AM

జిల్లాకు చేరిన 82 శాతం ఉచిత పాఠ్య పుస్తకాలు జూన్ 12న విద్యార్థులకు పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు

08-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్:(జహీరాబాద్)

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడులు ప్రారంభమయ్యే నాటికే ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లాకు అవసరమైన పాఠ్య పుస్తకాలలో ఇప్పటికే 82 శాతం పుస్తకాలు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లా కేంద్రానికి చేరుకున్న ఉచిత పాఠ్య పుస్తకాలు

వచ్చిన పుస్తకాలను జిల్లా కేంద్రంలోని గోదాముల్లో భద్రపరిచారు.జిల్లాలో మొత్తం 1,351 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 860, ప్రాథమికోన్నత పాఠశాలలు 197, ఉన్నత పాఠశాలలు 205 కాగా, ఆదర్శ, గురుకుల తదితర పాఠశాలలు 89 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 1.17 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.విద్యార్థుల కోసం మొదటి విడతలో మొత్తం 7,14,660 పార్ట్-1 పుస్తకాలు అవసరమవగా, ఇప్పటికే 5,87,410 పుస్తకాలు జిల్లాకు చేరాయి. మిగిలిన 1,27,250 పుస్తకాలు మరో రెండు మూడు రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పార్ట్-2కు సంబంధించిన 2,71,460 పుస్తకాలు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉందన్నారు.త్వరలో ఈ పుస్తకాలను మండల వనరుల కేంద్రాలకు పంపించి, అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈసారి పూర్తి స్థాయిలో పుస్తకాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

జిల్లాకు చేరిన 82 శాతం ఉచిత పాఠ్య పుస్తకాలు జూన్ 12న విద్యార్థులకు పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News