Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం

26-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సర్పంచుల హక్కుల కోసం ఐక్య పోరాటం

- జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్‌లో బుధవారం నిర్వహించిన సర్పంచుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన,ప్రస్తుతం వారు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సర్పంచుల వేతనాలను 6,500 నుంచి ₹25 వేల రూపాయల వరకు పెంచాలని,గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల ఫ్రీజ్‌ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా సర్పంచుల ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలిగా టేకు మంజుల,ప్రధాన కార్యదర్శిగా గిరికంటి నిరంజన్ గౌడ్,ఉపాధ్యక్షులుగా తాండ్రా నారాయణస్వామి,జెన్నా సిద్ధులు,ఇటమోని గీతా యాదవ్,కార్యదర్శిగా చిన్నం బీరప్ప,ప్రచార కార్యదర్శిగా భూక్య రాజారాం నాయక్,సహాయ కార్యదర్శిగా ఒగ్గు రవళి,కోశాధికారిగా కాసులు అంజయ్యలను ఎన్నుకున్నారు.కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కొప్పుల వెంకటరెడ్డి మాట్లాడుతూ...సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,ఫోరం రాష్ట్ర నాయకులు,జిల్లాలోని మండల ప్రాంతా గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా సర్పంచుల చైతన్య సదస్సులో నూతన జిల్లా కమిటి నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News