Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

16-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్నిప్రమాదాలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రమాదాలను నివారించే విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లే జరుగుతాయని తెలిపారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే భద్రతా నియమాలను పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు,విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించాలని, ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా స్పందించడం చాలా అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్,సిబ్బంది మల్లికార్జున్,హరీష్ రెడ్డి, కరుణాకర్,శ్రీనివాస్,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News