Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:30 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లిలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

22-02-2026 998 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు బాల్యస్మృతులనునెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.తమకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చిన గురువులు శంకరయ్య, అంజయ్య, వెంకటముత్యాలు, రమాదేవిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. దూర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నవారు, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు తమ ప్రస్తుత హోదాలను పంచుకుంటూ గురువులతో ముచ్చటించారు.పూర్వ విద్యార్థులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రోజంతా సందడిగా గడిపారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు.ఈ సందర్భంగా తమ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కక్కిరేణి భిక్షం కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం రూ.15 వేల విరాళాన్ని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో బొడిగె అంజయ్య, చెరుకు మధుసూధన్, ఫైళ్ల రవి, గోపగోని లింగస్వామి, అంతటి అశోక్, చిట్టిపోలు రాజశేఖర్, మిద్దెల రామ్మోహన్, నమ్ముల రవి, బొల్లోజు ధనుంజయ, గోపగోని శ్రీనివాస్, పంతంగి మధనాచారి, కంకల నర్సింహ, బండ శేఖర్, ఆకుల వసంత, బొడిగె పద్మ, శోభ, అశోక్ రామ్, ప్రసన్న, వెంకట్ రెడ్డి, మధుసూదన్, సైదులు, విజయ్ కుమార్, కిరణ్, శ్రీధర్, ప్రదీప్, మజ్జు, ఉస్మాన్, ఫాతీమా, గణేష్, రమేష్, లింగస్వామి, లక్ష్మీదేవమ్మ, జయసుధ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లిలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News