Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి

18-05-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ : సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తే విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘విద్యా వారోత్సవాల’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విశ్వవిద్యాలయం రూపొందించిన ‘ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ (ఐడీపీ)’ అమలు ద్వారా సమగ్ర డిజిటల్‌ విద్యాసంస్థగా ఎదిగే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఐదో దశాబ్దంలోకి అడుగుపెట్టిన విశ్వవిద్యాలయానికి ఇది ‘పరివర్తన దశాబ్దం’గా నిలుస్తుందని తెలిపారు.

సాంప్రదాయ విద్యతో పాటు ఉపాధి ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యార్థిని కేంద్రబిందువుగా చేసుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అకడమిక్‌ వ్యవహారాలు, విద్యార్థి సేవలు, పరిపాలన, సాంకేతిక సేవలు, స్కిల్‌ డెవలప్మెంట్‌ అనే ఐదు కీలక విభాగాల సమన్వయంతో కార్యాచరణ కొనసాగుతోందన్నారు.

ఈ సందర్భంగా ‘సంస్థాగత అభివృద్ధి సమగ్ర ప్రణాళిక (2026–2036)’ను విడుదల చేశారు. అలాగే ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ (ఎన్‌సీవీఈటీ)’ గుర్తింపు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా. యల్‌. విజయకృష్ణారెడ్డి, ఓఎస్‌డీ ప్రొ. రవీంద్రనాథ్‌ సోలమన్‌, డైరెక్టర్లు, డీన్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్‌ విద్యాసంస్థగా అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ.సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక కీలకం : వీసీ ఘంటా చక్రపాణి

Article Image

హైదరాబాద్‌ : సంస్థాగత అభివృద్ధి ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తే విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘విద్యా వారోత్సవాల’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విశ్వవిద్యాలయం రూపొందించిన ‘ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ (ఐడీపీ)’ అమలు ద్వారా సమగ్ర డిజిటల్‌ విద్యాసంస్థగా ఎదిగే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఐదో దశాబ్దంలోకి అడుగుపెట్టిన విశ్వవిద్యాలయానికి ఇది ‘పరివర్తన దశాబ్దం’గా నిలుస్తుందని తెలిపారు.

సాంప్రదాయ విద్యతో పాటు ఉపాధి ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యార్థిని కేంద్రబిందువుగా చేసుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అకడమిక్‌ వ్యవహారాలు, విద్యార్థి సేవలు, పరిపాలన, సాంకేతిక సేవలు, స్కిల్‌ డెవలప్మెంట్‌ అనే ఐదు కీలక విభాగాల సమన్వయంతో కార్యాచరణ కొనసాగుతోందన్నారు.

ఈ సందర్భంగా ‘సంస్థాగత అభివృద్ధి సమగ్ర ప్రణాళిక (2026–2036)’ను విడుదల చేశారు. అలాగే ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌ (ఎన్‌సీవీఈటీ)’ గుర్తింపు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా. యల్‌. విజయకృష్ణారెడ్డి, ఓఎస్‌డీ ప్రొ. రవీంద్రనాథ్‌ సోలమన్‌, డైరెక్టర్లు, డీన్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News