Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:26 AM

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

21-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

- అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా కార్యక్రమం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

బుధవారం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం అవగాహన కార్యక్రమంలో భాగంగా, సూర్యాపేట పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డి మార్ట్ ఉద్యోగులకు, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ వాహనదారులకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, విధుల నిర్వహణ కోసం ప్రయాణించే సిబ్బంది జాగ్రత్తగా గమ్యానికి చేరుకోవాలని, రోడ్డు దాటే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కుటుంబానికి అండ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించగా, వేగంగా వాహనాలు నడపమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయిరాం, శివతేజ, మహేందర్, మహిళా ఎస్సై నీలిమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డి మార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News