Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:45 AM

ధనుర్వాసం వేళ గోదాదేవి పల్లకి సేవ… భక్తుల తాకిడి

20-12-2025 259 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ధనుర్వాసం సందర్భంగా గోదాదేవి పల్లకి సేవ… బోగారంలో భక్తి పారవశ్యం

రామన్నపేట స్థానికం ప్రతినిధి

ధనుర్వాసం మాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో గోదాదేవి ఆండాళ్ అమ్మవారి పల్లకి సేవ – నగర సంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు సాగుతూ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది.

గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవ, రామాలయం, రేణుక ఎల్లమ్మ ఆలయాల గుండా గ్రామపంచాయతీ కార్యాలయం వరకు, అక్కడి నుంచి వికాస్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాలను ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు నిత్యానందం, రామాలయ అర్చకుడు జెళ్లా నిరంజన్, రామన్నపేట చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ భజన మండలి భక్త బృందం, గ్రామ మహిళలు, చిన్నా-పెద్దా తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నగర సంకీర్తనతో గ్రామాన్ని భక్తిమయంగా మార్చారు.

చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ధనుర్వాసం అత్యంత పవిత్రమైన మాసమని, దైవానికి ఇష్టమైన ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఆలయ దర్శనాలు చేయడం శ్రేష్టమని అన్నారు. బోగారం గ్రామంలో గోదాదేవి పల్లకి సేవ నిర్వహించడం గ్రామానికి ఎంతో మంగళకరమని, అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధారులు, ఆంజనేయ స్వామి భక్త బృందం, సీతారామచంద్ర స్వామి భక్త బృందం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ధనుర్వాసం వేళ గోదాదేవి పల్లకి సేవ… భక్తుల తాకిడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News