Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

19-12-2025 1,582 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రైతుల డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయా? ట్యాబ్ ఎంట్రీలపై కలెక్టర్ ఆరా
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది? ఈలోపు కొనుగోలు ప్రక్రియ పూర్తవ్వాలి కదా” అంటూ అధికారులను ప్రశ్నించారు.

ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయా, రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా అనే అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, చెల్లింపులు తక్షణమే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, రోజువారీ పురోగతిపై నివేదికలు సమర్పించాలని సూచించారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News