Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

15-02-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని డిమాండ్

రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సిపిఐ పార్టీ మాజీ ఎంపీ, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గీత పనివారల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడి అనేక చిరస్మరణీయ విజయాలు సాధించారని తెలిపారు.

ధర్మబిక్షం సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు ఆయన కాంస్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరం యువతకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ జయంతి వేడుకల్లో గీత పనివారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, గంగాపురం యాదయ్య, బాలగోని నరసింహ, కూనూరు కృష్ణ, వీరమల్ల ముత్తయ్య, బత్తుల సత్తయ్య, గుండు లింగయ్య, గోపగోని మల్లయ్య, భూపతి నరసింహ, వీరమల్ల వెంకటయ్య, పల్లె మల్లేష్, ఆకిటి స్వామి, వీరమల్ల నరసింహ, వీరమల్ల శేఖర్, గోపగోని గోపాల్, గిరకల శంకరయ్య, లింగస్వామి శంకరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ధర్మబిక్షం కాంస్య విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News