Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:41 AM

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తి
March 26, 2026 08:24 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి – మినీ ట్యాంక్ బండ్‌పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, నికార్సైన కమ్యూనిస్టు నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ధర్మభిక్షం 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ధర్మభిక్షం చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మభిక్షం జీవితం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసి పేదల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసి ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చారని గుర్తు చేశారు.

నికార్సైన కమ్యూనిస్టు నాయకుడిగా చట్టసభలను ఉద్యమ వేదికగా మార్చి ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని, అలాంటి నాయకుడే ధర్మభిక్షం అని అన్నారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని, జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ధర్మభిక్షం పేరు పెట్టాలని సూచించారు. ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫి ఉల్లా, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News