Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం

16-05-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఐ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో నిరసన

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతూ ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.ధరల పెంపును నిరసిస్తూ శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో హైవేపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పగిల్ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఎలాంటి ధరల పెంపు చేయకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా ప్రధాని మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దేశంలో చమురు నిల్వలకు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పదేపదే ధరలు పెంచడం దుర్మార్గమని అన్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, బేధరకోట యాదయ్య, దాసరి మనోహర్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు ముప్పిడి నర్సింహా, దామ లింగస్వామి, దేశగాని శ్రీను, గోసుకొండ మహేష్, బేడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధరల మోతతో ప్రజలపై భారమేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News