Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా

16-05-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వరి ధాన్యం కొనుగోలు సమయంలో తూకాల్లో జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సంఘం నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే తూకం వేసే సమయంలో మోసాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులు నిర్వహించిన నిరసనలో ధాన్యం లోడ్ చేసిన కాంటాలను తనిఖీ చేయగా, ఒకే లారీలో 3 క్వింటాళ్ల 70 కిలోల వరకు తూకంలో తేడా బయటపడిందని తెలిపారు.రైతుల ఆందోళనతో తహసీల్దార్ సహా ప్రభుత్వ అధికారులు మార్కెట్ యార్డుకు చేరుకుని తూకాల్లో జరిగిన తేడాలను సరిచేసినట్లు చెప్పారు. అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

మిల్లర్లతో సమన్వయం చేసుకుని ధాన్యాన్ని త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని, తూకాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు చీర్క అలివేలు, బోరం నర్సిరెడ్డి, చీర్క సంజీవరెడ్డి, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, కొండే శ్రీశైలం, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం తూకాల్లో దోపిడీ అరికట్టాలి చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతుల ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News