Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

16-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మార్కెట్లలో రెండు నెలలుగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

రైతు సంఘాల పిలుపుమేరకు పెద్దతుమ్మలగూడెం రైతుల ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం భువనగిరికి బయలుదేరగా రామన్నపేట వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సాయంత్రం విడుదల చేశారు.

అరెస్టులతో ఉద్యమాలు ఆగవు

ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

రైతులు మాట్లాడుతూ మార్కెట్లలో ధాన్యం నెలల తరబడి నిల్వ ఉండటంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లారీలు, గిడ్డంగులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

క్వింటాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు కోతలు వేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, కాంటా వేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Sthanikam

ధాన్యం కోసం పోరాడితే అరెస్టులా..? రైతు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News