Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:29 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు

11-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు, మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా వాహనాలు, సంచులు లేకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అమ్మిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు చేయాలని, వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యం కల్పించాలని, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో భారీగా జొన్న సాగు జరిగినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News