Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:42 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
April 09, 2026 11:03 AM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులు దళారులను నమ్మొద్దని సూచన

సూర్యాపేట మండలంలోని గాంధీ నగర్, 13వ వార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.ధాన్యంలో తేమశాతం 17కు మించకుండా ఉండాలని, పంటను బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామసాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్పరాజు రమేష్, మర్రిపల్లి వెంకటేష్, రాగం విజయ్, అవిలయ్య, సైదులు, వాసు, పిఏసీఎస్ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News