Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన

13-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో రైతులు మంగళవారం నిరసన చేపట్టారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో పాటు తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

కేసీఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రోజువారీగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పాపట్ల నరహరి, గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం, రైతులు కర్రె చంద్రశేఖర్‌, ఒగ్గు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News