Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం. కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా

12-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

15 రోజుల్లో పూర్తి కొనుగోళ్లు చేస్తామని జేసీ హామీ

నల్లగొండ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా జిల్లాలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నానన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా లారీలు లేక వడ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయని తెలిపారు. తేమ, నాణ్యత పేరుతో రైతుల వడ్లలో అన్యాయంగా కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

దళారులు రైతులను భయపెట్టి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని విమర్శించారు. కాంటాలు సకాలంలో నిర్వహించకపోవడంతో రైతులు ఎండలో, వర్షంలో రోజులు తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. మార్కెట్‌ యార్డుల్లో కాంగ్రెస్‌ నాయకులు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల్లో తార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నా అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని, సరిపడా లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. రైతుల వడ్లలో అన్యాయ కోతలు నిలిపివేయాలని, దళారుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌.. 15 రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం. కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ధర్నా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News