Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

07-05-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​‘ఏసీ గదుల్లో కాదు.. రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా’

చౌటుప్పల్ మార్కెట్‌లో వడ్ల కుప్పల పరిశీలన

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీ. హరీశ్‌రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడం, తరుగు పేరుతో కోతలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు హరీశ్‌రావుకు వివరించారు. మార్కెట్‌లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన ఆయన రైతులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. “నేను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం లేదు.. రైతుల మధ్యే నిలబడి వారి బాధలు వింటున్నా” అని వ్యాఖ్యానించారు.మాయిశ్చర్ పరీక్షలు, గన్నీ బ్యాగులు, కాంటాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మిల్లుల్లో కూడా కటింగ్ పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని హరీశ్‌రావు విమర్శించారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్‌: హరీశ్‌రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News