Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్‌కు బీజేపీ వినతి

21-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మౌలిక వసతుల కొరత, ‘తరుగు–తేమ’ పేరుతో రైతుల దోపిడీని అరికట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, ధాన్యం లిఫ్టింగ్ అనంతరం వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయాలని డిమాండ్ చేశారు.

పోచంపల్లిలో కొందరు రైస్‌మిల్లర్లు కుమ్మక్కై రైతులు పండించిన ధాన్యంలో అధిక కోతలు విధిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, డీఎస్‌వో ద్వారా వివరాలు సేకరించి రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ్, తుమ్మల మురళీధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కదూరి అచ్చయ్య, చందా మహేందర్‌గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్, నాయకులు లక్ష్మీనారాయణ, కమిటీకారి కృష్ణ, తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మాధురి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్‌కు బీజేపీ వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News