జిల్లాలో కొంతమంది రైతులు, వ్యాపారులు రహదారులపై ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం సరిగా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వలన ద్విచక్ర వాహనదారులు జారి పడే ప్రమాదం ఉండటమే కాకుండా, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు కలుగుతోందన్నారు. రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్దిష్ట కల్లాల్లో లేదా వ్యవసాయ శాఖ సూచించిన ప్రదేశాల్లోనే ధాన్యాన్ని ఆరబోసుకోవాలని సూచిస్తూ, ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ధాన్యం ఆరబోయడానికి ప్రభుత్వం సూచించిన ప్రదేశాలనే వినియోగించాలి:జిల్లా ఎస్పీ

Krishna
జిల్లాలో కొంతమంది రైతులు, వ్యాపారులు రహదారులపై ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం సరిగా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వలన ద్విచక్ర వాహనదారులు జారి పడే ప్రమాదం ఉండటమే కాకుండా, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు కలుగుతోందన్నారు. రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్దిష్ట కల్లాల్లో లేదా వ్యవసాయ శాఖ సూచించిన ప్రదేశాల్లోనే ధాన్యాన్ని ఆరబోసుకోవాలని సూచిస్తూ, ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి