Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 04:42 AM

ధాన్యం కొనుగోళ్లలో రైతుల నెత్తిపై శఠగోపం!

07-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బస్తాకు 42.700 కిలోల తూకం.. రూ.3 వసూలు..

ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం..

నల్గొండ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు నిలయంగా మారాయని, రైతులను నిలువునా దోచుకుంటున్నారని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఆర్జాలబావి, దండంపల్లి, ఎస్ఎల్బీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ.. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లర్లు, అధికారుల కుమ్మక్కు...

​కేంద్రాలను సందర్శించిన అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. నిబంధనల ప్రకారం కాకుండా బస్తాకు 42 కిలోల 700 గ్రాముల చొప్పున తూకం వేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని మండిపడ్డారు. ప్రతి బస్తాకు మూడు రూపాయల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారని ఇది అత్యంత దారుణమని పేర్కొన్నారు. తూకం వేసిన వెంటనే ట్రక్ షీట్లు ఇవ్వడం లేదని, మిల్లుల వద్దకు వెళ్లాక తూకం తక్కువ వచ్చిందనే సాకుతో మిల్లర్లు ట్రక్ షీట్లు మార్పించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రులు చోద్యం చూస్తున్నారు..

కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం ఎంత వచ్చినా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశాం. కానీ నేడు 50 రోజులు గడుస్తున్నా సగం ధాన్యం కూడా సేకరించలేదు. జిల్లా మంత్రులు, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు అని కంచర్ల ఆరోపించారు. తమకు ఇష్టమైన వారికే ముందుగా తూకం వేస్తూ సామాన్య రైతులకు కొర్రీలు పెడుతున్నారని దుయ్యబట్టారు.

కలెక్టరేట్ ముట్టడి...

​జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు జరిగే ప్రతి అన్యాయంపై తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో రైతుల నెత్తిపై శఠగోపం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News