Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 03:48 AM

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..
07-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నిబంధనలు సరళీకరించాలి..

హౌసింగ్ బోర్డు సమీక్షలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిబంధనల సడలింపు అవసరం..

​సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యంగా పథకానికి అడ్డంకిగా మారిన కొన్ని నిబంధనలను తొలగించాలని ఆయన ప్రతిపాదించారు. ద్విచక్ర వాహనం లేదా నాలుగు చక్రాల వాహనం ఉన్నంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ప్రకటించడం సరికాదు. ఈ నిబంధనలను వెంటనే తొలగించి నిజమైన పేదలకు పథకం అందేలా చూడాలి అని ఆయన స్పష్టం చేశారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశాన్ని కూడా మండలి చైర్మన్ ప్రస్తావించారు. చిన్నపాటి అసౌకర్యాల వల్ల సిద్ధంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతోందని ఆ లోపాలను సరిదిద్ది త్వరగా ఇళ్లను అప్పగించాలని కోరారు.

భూ సమస్యల పరిష్కారానికి 'భూ భారతి'..

​ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా భూ వివాదాలు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుత్తా సూచించారు. 'భూ భారతి' కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని, తద్వారా అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిని మంత్రులు సమీక్షించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News