Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 03:51 AM

చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్ రూ.10 లక్షల నగదు స్వాధీనం

07-05-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రెండు కేసులకు సంబంధించిన రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ S.సతీష్ కుమార్ IPS ఆదేశాలు, పెనుకొండ SDPO U.నరసింగప్ప పర్యవేక్షణలో గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ CI B.శేఖర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారివద్ద నుంచి రెండు కేసులకు సంబంధించిన నగదును రికవరీ చేశారు. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

2024 ఏప్రిల్ 2న గోరంట్లలో చైతన్య స్కూల్ సమీపంలో స్కూటీ డిక్కీలో ఉన్న రూ.5.90 లక్షలు, అలాగే 2025 జూలై 14న వాసవీ కళ్యాణ మండపం ఎదురుగా కారులో ఉన్న రూ.7 లక్షలను అద్దాలు పగులగొట్టి దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.

Cr.No.115/2025 కేసులో రూ.6 లక్షలు, Cr.No.92/2024 కేసులో రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను అరెస్ట్ చేసిన CI B.శేఖర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Sthanikam

చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్ రూ.10 లక్షల నగదు స్వాధీనం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రెండు కేసులకు సంబంధించిన రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ S.సతీష్ కుమార్ IPS ఆదేశాలు, పెనుకొండ SDPO U.నరసింగప్ప పర్యవేక్షణలో గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ CI B.శేఖర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారివద్ద నుంచి రెండు కేసులకు సంబంధించిన నగదును రికవరీ చేశారు. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

2024 ఏప్రిల్ 2న గోరంట్లలో చైతన్య స్కూల్ సమీపంలో స్కూటీ డిక్కీలో ఉన్న రూ.5.90 లక్షలు, అలాగే 2025 జూలై 14న వాసవీ కళ్యాణ మండపం ఎదురుగా కారులో ఉన్న రూ.7 లక్షలను అద్దాలు పగులగొట్టి దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.

Cr.No.115/2025 కేసులో రూ.6 లక్షలు, Cr.No.92/2024 కేసులో రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను అరెస్ట్ చేసిన CI B.శేఖర్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News