Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’

07-05-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కార్యక్రమం

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఇంధన శాఖల సమన్వయంతో రైతుల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతులకు ఉపయోగపడే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.రైతులు తమ పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ‘అన్నదాత’ నుంచి ‘విద్యుత్ ప్రదాత’గా మారే అవకాశం ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చేన్నగోని అంజయ్యగౌడ్, వ్యవసాయ మండల అధికారి నాగరాజు, కౌన్సిలర్లు కొసనం రాకేష్‌రెడ్డి, పాక చిరంజీవి, విద్యుత్ శాఖ అధికారులు, సీఈ, డీఈ, ఏఈ, సర్పంచ్ శ్రీధర్‌రావు, రైతులు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

‘అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News